చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం గరిడా పంచాయతీ గాయత్రీ విఓలో మాస్టర్ ట్రైనర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ షాప్ లో రైతులకు కావాల్సిన కషాయాలు, తెగుళ్లకు, పంట ఎదుగుదలకు కావాల్సిన అన్ని రకాల ఉత్పత్తులు అందుబాటులో వుంటాయని వివరంగా చెప్పారు.