రైతులకు ఏ సమస్య వచ్చినా నన్ను సంప్రదించండి

75చూసినవారు
రైతులకు ఏ సమస్య వచ్చినా నన్ను సంప్రదించండి
రైతులకు ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. గుర్ల మండలం గుజ్జంగివలసలో శనివారం ఆయన పర్యటించారు. అనంతరం గ్రామంలో ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గ్రామంలో ఇటీవల మంజూరైన 24 మంది రైతులకు చెందిన వ్యవసాయ పంపు సెట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ సన్యాసినాయుడు, జడ్పిటిసి సభ్యులు అప్పలనాయుడు తదితర వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్