బొండపల్లి మండలం దేవిపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ రాజమ్మ తల్లి అమ్మవారి దేవాలయాన్ని ఆదివారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. అనంతరం పురోహితులు వేదలాంఛనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ అమ్మవారికి పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామం సకల సౌభాగ్యాలతో శోభిల్లాలని వేడుకున్నారు.