రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

66చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన బొండపల్లి మండలంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గజపతినగరం నుండి విజయనగరం వెళ్తున్న కారు బిల్లలవలస సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో 108 లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్