మధుపాడలో కార్డెన్ సెర్చ్

65చూసినవారు
గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామంలో గురువారం సాయంత్రం కార్టెన్ సెర్చ్ కార్యక్రమం గజపతినగరం సీ. ఐ ఎన్. వి. ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టారు. అనుమానిత ఇళ్లను తనిఖీ చేశారు. అలాగే వాహనాల లైసెన్సులు పరిశీలించారు. ఎస్ఐలు మహేష్, లక్ష్మణరావు, లక్ష్మీ ప్రసన్నకుమార్, శిరీష పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్