గజపతినగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం సందర్శించి సమస్యలు పరిష్కారంపై చర్చించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రావాడ సత్యనారాయణతో కళాశాల పరిస్థితులు, అభివృద్ధి అవసరాలను వివరంగా తెలుసుకున్నారు. మౌలిక వసతుల మెరుగుదలపై చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.