పోస్టల్ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్ స్పెక్టర్ బి. ఉపేంద్ర బుధవారం అన్నారు. గజపతినగరం మండలంలోని జిన్నాంలో డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం (డిసి డిపి) "జనంలోకి మనం" కార్యక్రమంలో పాల్గొని, పోస్టల్ పథకాల లబ్ధిని వివరించారు. అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.