రాజమహేంద్రవరంలో జరుగుతున్న
టీడీపీ మహానాడు కార్యక్రమానికి కోరప్ కృష్ణాపురం గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం ఉదయం 7 గంటలకు బయల్దేరారు. గజపతినగరం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ కె.నాయుడు ఏర్పాటు చేసిన బస్సులో వారు బయలుదేరారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మంత్రి రామారావు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం కోసం మహానాడు ఒక వేదికగా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని చెప్పారు.