సమస్యలు పరిష్కరించడమే సందర్శనల లక్ష్యం

70చూసినవారు
సమస్యలు పరిష్కరించడమే సందర్శనల లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అన్నారు. గురువారం బొండపల్లి మండలంలోని ముద్దూరు గ్రామంలో జరిగిన గ్రామ సందర్శన కార్యక్రమంలో కలెక్టర్ అంబేద్కర్ పాల్గొన్నారు. అంగన్వాడి కేంద్రం, పాఠశాల, ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. భోజనాలను రుచి చూశారు. మండల ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్, ఎంపీడీవో హరిహరరావు, గ్రామ సర్పంచ్ మునకాల పైడిపునాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్