ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురికి గాయాలు

1577చూసినవారు
పార్వతీపురం మండలం నర్సిపురం జనహిత స్కూల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం పార్వతీపురం నుంచి మరిపివలస వైపు వెళ్తున్న ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో ఆటో డ్రైవర్తో పాటు ముగ్గురు గాయపడ్డారు. స్థానికంగా ఉన్న పశువుల కాపరులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీతో డ్రైవర్ పరారయ్యాడని, ఘటనపై పోలీసులకు సమాచరం అందించినట్లు స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్