ఘాట్ రోడ్డు లో ఆటో బోల్తా పడి ఐదుగురికి తీవ్ర గాయాలు

1952చూసినవారు
ఘాట్ రోడ్డు లో ఆటో బోల్తా పడి ఐదుగురికి తీవ్ర గాయాలు
గుమ్మలక్ష్మీపురం మండలం సప్పగూడ గ్రామ సమీపంలో గల ఘాట్ రోడ్డు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లప్పటి గ్రామానికి చెందిన 14 మంది ఆటోలో ఘోరటి గ్రామంలో పెళ్లి కి వెళ్లి తిరిగి వస్తుండగా అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 5 గురికి తీవ్రగాయాలు అయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రులను తాడికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్