అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యూటీ అమలు చేయాలి

73చూసినవారు
అంగన్వాడీ ఉద్యోగులకు సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని సీఐటీయూ నాయకులు మండంగి రమణ, సన్యాసిరావు డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులతో కలిసి గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్ కార్యాలయం ముందు బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ రామారావుకు అందజేశారు.

సంబంధిత పోస్ట్