కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలంలోని విశ్వనాథపురం, లోవలక్ష్మీపురం, బుడ్డెమ్మఖర్జ, దొరజమ్ము గ్రామాల్లో సోమవారం పిల్లి పండగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ. గిరిజన కులాల్లో కొండదొర కులానికి ఈ పిల్లి పండగ ఆచార సాంప్రదాయం పూర్వికుల నుంచి ఉందని వెల్లడించారు. ఈ పండగకు అడవిదేవతలైన పంటనొద్దులు, వేటనొద్దలు అనే దేవతలకు పూజలు చేస్తామని అన్నారు.