జియ్యమ్మ వలస మండలం కన్నపుదొర వలసలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రమౌళి అనే వ్యక్తి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఆదివారం టిఫిన్ సెంటర్ మూసివేసి తమ ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చల్లరేగి గ్యాస్ బండలు పేలాయి. స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి మంటలు అదుపు చేశారు. అప్పటికే అందులో ఉన్న సామాగ్రి కాలిపోయింది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియవలసి ఉంది.