అకాల వర్షం కారణంగా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి చేపట్టిన జంఝావతి కన్నీటి యాత్రను వాయిదా వేస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు బుధవారం తెలిపారు. వర్షాలు తగ్గిన తర్వాత యాత్ర ప్రారంభిస్తామని చెప్పారు. కొమరాడ మండలంలోని జంఝావతి సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేసే వరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.