ఎపి స్టేట్ ఎం. ఎస్. ఎం. ఈ డవలెప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి. శివ శంకర్ ను నియమిస్తూ తొలి విడత జాబితాలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శివశంకర్ స్వగ్రామం పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో పెదబుడ్డిడి. శివ శంకర్ కమర్షియల్ టాక్స్ కమీషనర్ గా విధులు నిర్వహించేవారు. స్వచ్చందంగా పదవీవిరమణ చేసి జనసేనా పార్టీలో చేరారు.