సైబర్ నేరాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, ప్రేమ పేరుతో మోసం తదితర సమస్యలపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వేచ్ఛగా తెలియజేయొచ్చని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీసుస్టేషన్ సిబ్బందితో ఫోన్ లో మాట్లాడి, ఫిర్యాదు వాస్తవమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.