మన్యం జిల్లాలో 18 ఏళ్ళు నిండిన యువతపై ప్రత్యేక దృష్టిని సారించి ఓటరుగా నమోదు చేయాలని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్, ఇన్ స్పెక్టర్ జనరల్, జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జెర్వర్ ఎం. వి. శేషగిరి బాబు తెలిపారు. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం-2025పై మంగళవారం జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు, అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్షించారు.