పార్వతీపురం: అంగన్వాడీ సహాయకుల నియామకానికి నోటిఫికేషన్

55చూసినవారు
పార్వతీపురం: అంగన్వాడీ సహాయకుల నియామకానికి నోటిఫికేషన్
మన్యం జిల్లాలో వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకుల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సోమవారం ఐసీడీఎస్ పీడీ డా. టి. కనకదుర్గ ఓ ప్రకటనలో తెలిపారు. కురుపాం ప్రాజెక్టు పరిధిలో 6, సీతంపేటలో 2, భామిని, పార్వతీపురం, సాలూరు పరిధిలో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందన్నారు. ఈనెల 27 సాయంత్రం 5 గంటల్లోపు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్