రెండు బైకులు ఢీ..నలుగురికి తీవ్ర గాయాలు

83చూసినవారు
గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు బలంగా ఢీకొడంతో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం గుమ్మలక్ష్మీపురం నుంచి తాడికొండ ద్విచక్ర వాహనంపై వెళుతున్న పత్తిక నాగేశ్వరరావు, కిల్లక సంతోష్, కోసింగి భద్ర నుంచి మురడ వెళుతున్న కిల్లక మురళి, కిల్లక అమల తలలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్