Oct 15, 2024, 09:10 IST/
బర్త్ డే పేరుతో నడిరోడ్డుపై హంగామా చేసిన కాంగ్రెస్ నేత (వీడియో)
Oct 15, 2024, 09:10 IST
ఓ కాంగ్రెస్ నాయకుడి బర్త్ డే వేడుకలు నడిరోడ్డుపై జరపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన తాజాగా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ నేత చిలుకూరి బాలు పుట్టిన రోజు వేడుకలు నడిరోడ్డుపై జరుపుకున్నాడు. అర్ధరాత్రి రాజీవ్ చౌక్‌లో డీజే, సౌండ్ సిస్టం పెట్టి డ్యాన్సులు వేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించారు. బాలుకు గజమాలను వెయ్యడానికి జేసీబీని పెట్టి రోడ్డుకు అడ్డంగా నిలపడంతో.. గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది.