నర్సీపట్నం: పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు
నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో సినీ నటుడు పోసాని కృష్ణ మురళి పై టిడిపి పార్టీ నాయకులు కోండ్రు మరిడయ్య గురువారం ఫిర్యాదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ విఆర్ నాయుడుపై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోసాని మురళీకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.