పంప్ హౌస్ ఆపరేటర్లకు బకాయి జీతాలు చెల్లించాలి

71చూసినవారు
పంప్ హౌస్ ఆపరేటర్లకు బకాయి జీతాలు చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. నెల్లిమర్ల మాస్టర్ పంప్ హౌస్ వద్ద సోమవారం మధ్యాహ్నం ఆపరేటర్లు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బకాయి జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన డిఇ, కాంట్రాక్టర్ మాట తప్పారని చెప్పారు. ఈ సమస్యపై విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద 26న ఆకలి దీక్ష నిర్వహిస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్