సముద్రాన్ని తలపిస్తున్న విశాఖ రహదారి

84చూసినవారు
సముద్రాన్ని తలపిస్తున్న విశాఖ రహదారి
విజయనగరం నుంచి విశాఖ వెళ్లేవారు వరద నీటిలో చిక్కుకుంటున్నారు. భోగాపురం మండలం రాజాపులోవ జంక్షన్ నుంచి తగరపువలస వెళ్లే సర్వీస్ రోడ్డు సోమవారం సముద్రాన్ని తలపిస్తోంది. ఈ రోడ్డు మొత్తం జల దిగ్బంధం అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం - విశాఖపట్నం ప్రధాన రహదారి కావడంతో వాహనాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి. పరిసర ప్రాంతాల్లో చెరువులు పొంగడంతో వరదనీరు రహదారిపై చేరింది.

సంబంధిత పోస్ట్