ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని వీరఘట్టం పట్టణం నందు పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయక్రిష్ణ శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత వంటగ్యాస్ సిలిండర్ అందుకున్న మహిళల కళ్లలో ఆనందం నాకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఉచిత వంట గ్యాస్ సిలిండర్ పథకం లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.