నియోజకవర్గంలో భారీ వర్షాలు

54చూసినవారు
పాలకొండ నియోజకవర్గం పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. చెట్ల కొమ్మలు విరిగి పడి విద్యుత్‌ వైర్లు కూడా తెగిపడడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వర్షం కురిసిన ప్రాంతాల్లో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌ దుక్కులకు ఈ వర్షం ఉపకరిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్