రేపు అకౌంట్లోకి 'పీఎం కిసాన్' డబ్బులు

67చూసినవారు
రేపు అకౌంట్లోకి 'పీఎం కిసాన్' డబ్బులు
పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం రేపు (మంగళవారం) రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.20వేల కోట్లను యూపీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బటన్ నొక్కి బదిలీ చేస్తారు. ఈ పథకం కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో.. రూ.2వేలు చొప్పున) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ఈ పెట్టుబడి సాయంపై మోదీ సంతకం చేశారు.

సంబంధిత పోస్ట్