దిగువకారిమాను గూడ: చెట్టుపై నుంచి జారిపడిన వ్యక్తి మృతి

63చూసినవారు
దిగువకారిమాను గూడ: చెట్టుపై నుంచి జారిపడిన వ్యక్తి మృతి
సీతంపేట మండలం దిగువకారిమాను గూడకు చెందిన సవర బుడ్డయ్య చెట్టు పైనుంచి జారిపడిన ఘటనలో శనివారం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం బిల్లగూడ గ్రామ సమీపంలో ఉన్న ములం చెట్టు ఎక్కి ములంకాడలు తీసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారిపడడంతో గాయాలయ్యాయి. కుటుంబీకులు స్థానిక ఏరియా ఆస్పత్రికి ఆతర్వాత మెరుగైన చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్