పాలకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

61చూసినవారు
పాలకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
పాలకొండ మండలం యరకరాయిపురం గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. కైలాష్ అనే వ్యక్తి తన బైక్ పై వెళ్తున్న నేపథ్యంలో ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన కైలాస్ ను స్థానికులు హుటాహుటిన పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్ ఐ ప్రయోగమూర్తి ఘటన స్థలానికి చేరుకుని, పరిస్థితి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్