లూయిస్ బ్రెయిలీ అంధుల పాలిట ఆరాధ్య దైవమని జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి ఎండి గయాజుద్దీన్ అన్నారు. మంగళవారం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం పట్టణం ఆర్.సి.ఎం ప్రాంగణంలో బ్రెయిలీ చిత్ర పటానికి పూలవేసి నివాళులర్పించారు. బ్రెయిలీ లిపిని కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఈ వేడుకలు జరుపుకుంటారన్నారు. అంధులకు ఉండే హక్కులు, వారు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కలిగించాలన్నారు.