చైనా లో విస్తరిస్తున్న కొత్త వైరస్ హెచ్ఎంపివీ పై మన్యం జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్. భాస్కర రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఎక్కువగా సమూహంలో సంచరించవద్దని సూచిస్తూ, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలో ఉన్న వైద్యాధికారులందరికి దీనిపై అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స చేసి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.