సైబర్ టెక్నాలజీ ద్వారా నేరాల నియంత్రణకు సైబర్ సెల్ ఐటి కోర్ టీం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ ఎస్ మాధవ్ రెడ్డి అన్నారు. సోమవారం పార్వతీపురం జిల్లా పోలీసు కార్యాలయంలో సైబర్ సెల్, ఐటి కోర్ టీం అధికారులు, సిబ్బంది పనితీరుపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. సైబర్ నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని వీటివల్ల ప్రజలు కష్టపడి సంపాదించుకున్న నగదు గుర్తు తెలియని వ్యక్తులు దోచుకుంటున్నారన్నారు.