సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చెయ్యడం జరిగిందని డిపిటిఓ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 9వ తేదీ నుండి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపో నుంచి హైదరాబాద్ కు 12 బస్సులు, విజయవాడకు 21 బస్సులు, విశాఖపట్నం 175 బస్సులు అదనంగా వేసామన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.