గిరిజన విద్యార్థులకు గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి ఉపాధి శిక్షణ ఇవ్వలేదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. కొద్దిమందికి మాత్రమే శిక్షణ ఇచ్చి బకాయిలు పెట్టేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.