పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను కుదిస్తూ ప్రభుత్వం జారీచేసిన 85 జీవోను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం పట్టణంలో ఆదివారం పీహెచ్సీ వైద్యుల సంఘం జిల్లా కార్యదర్శి వినోద్ ఆధ్వర్యంలో వైద్యులు తమ నిరసన వ్యక్తం చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు ప్రత్యేక అలవెన్సులు ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.