ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు నష్టపోయిన ప్రజలు సంబంధిత సచివాలయాల్లో వివరాలను నమోదు చేసుకోవాలని పార్వతీపురం కలెక్టర్
ఎ. శ్యాం ప్రసాద్ ఆదివారం తెలిపారు. వర్షాలకు ఇల్లు నష్టపోయిన వారి వివరాలను ఇప్పటికే అధికారులు సేకరించి నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. కాగా వర్షాలకు ఇల్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా వాటి వివరాలను సంబంధిత సచివాలయాల కు వెళ్లి వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.