రాజాం: బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు

82చూసినవారు
రాజాం: బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు
రాజాం నియోజకవర్గంలో ఎవరైనా బెల్ట్ దుకాణాల ద్వారా మద్యం అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాజాం ఎక్సైజ్ సిఐ ఆర్. జైభీమ్ ఆదివారం హెచ్చిరించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ కొందరు కిరాణా, పాన్ షాప్, కూల్ డ్రింక్స్ షాపుల పేరుతో బోర్డులు ఏర్పాటు చేసి ఆక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తమ సిబ్బందితో దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్