17 క్వింటాలు బియ్యం స్వాధీనం

583చూసినవారు
17 క్వింటాలు బియ్యం స్వాధీనం
మెంటాడ మండలంలో బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై పౌరసరఫరాల ఉప తహశీల్దారు రవికుమార్ సోమవారం దాడులు చేశారు. ముగ్గురు వ్యాపారుల వద్ద మొత్తం 17 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. ఆండ్ర గ్రామంలో కె. శంకరావు వద్ద నాలుగు క్వింటాళ్లు, టి. రమేశ్ నుంచి 725 కిలోలు, వి. చంద్రమౌళి నుంచి 575 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై 6ఎ కేసులను నమోదు చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్