వినియోగదారులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని విజయనగరం ఉమ్మడి జిల్లా కన్జ్యూమర్ జిల్లా డైరెక్టర్ బలగ రాధ అన్నారు. సాలూరు పట్టణంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద శనివారం జాతీయ వినియోగదారుల దినోత్సవం ను పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో కన్జ్యూమర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినియోగదారుల సంఘం జిల్లా డైరెక్టర్ బలగ రాధ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.