పోడు వ్యవసాయం చేసే గిరిజన రైతులు తప్పనిసరిగా భూములకు బలాన్ని చేకూర్చేందుకు ఘన, ద్రవ, జీవామృతాలు వాడాలని లేనిపక్షంలో తొందరగా నిస్సారం అయిపోతాయని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు హితవు పలికారు. బుధవారం మండలంలో గల మిలియాకంచూరు, తుమరావల్లి గిరిజన గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పోడులో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు అన్నారు.