రహదారి ప్రమాదంలో వరుడికి తీవ్రగాయాలైన ఘటన శనివారం సాలూరు మండలంలో చోటు చేసుకుంది. నెల్లిమర్ల మండలం కొండవెలగాడకు చెందిన రాజశేఖర్ రెడ్డికి.. మండలంలోని భూతాడ కర్రివలసకు చెందిన అనూరాధకు శుక్రవారం రాత్రి వివాహమైంది. అనంతరం బొలేరో వాహనంలో వధువు ఇంటికి బంధుమి త్రులతో వెళ్తుండగా.. మామిడిపల్లి వద్ద వాహనం అదుపు తప్పి విద్యుత్తు సబ్ స్టేషన్ గోడకు ఢీకొంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.