ఉచిత బస్సు పథకంపై గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉగాది నుంచి ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లా పాచిపెంట మం. పెదచీపురువలసలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ ప్రకటన చేశారు. మగవాళ్లకు ఈ పథకం వర్తించదని చెప్పుకొచ్చారు. కాగా, నిన్న అధికారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఉగాది నాటికి ఈ స్కీం అమల్లోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.