మలేరియా, డెంగ్యూ వ్యాధులపై అవగాహన కార్యక్రమం

61చూసినవారు
మలేరియా, డెంగ్యూ వ్యాధులపై అవగాహన కార్యక్రమం
కొత్తవలస మండలం వియ్యంపేట పీహెచ్ సి వైద్యులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జడ్పీ హైస్కూల్, వియ్యంపేట బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో మలేరియా, డెంగ్యూ వ్యాధులపై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. వర్షాకాలంలో కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అందరూ దోమల తెరలు వాడాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్