ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని ఆదివారం ఆమె స్వగృహంలో డిఎస్పీ జి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి తన అభినందనలు తెలిపారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలే తనకు ప్రధానమని, నియోజకవర్గ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పార్టీలకు అతీతంగా పనిచేయాలని ఎమ్మెల్యే లలిత కుమారి డి ఎస్ పి శ్రీనివాసరావుకు సూచించారు.