జిల్లా ఆరోగ్య శ్రీ పథకం జిల్లా కో ఆర్డినేటర్ బుధవారం ఆనందపురంలో జరుగుతున్న 104 వైద్య శిబిరంను ఆకస్మిక తనిఖీ చేశారు. 104 వాహనం సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు అన్ని సౌకర్యాలు అమలు అవుతున్నాయో లేదో పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం అమలు తీరును గమనించారు. రికార్డ్ లను, రోజువారీ నివేదికలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్య అధికారి షహనాజ్ సాధియ, సామజిక ఆరోగ్య అధికారి పి సాంబమూర్తి పాల్గొన్నారు.