సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం చెల్లింపు, రెగ్యులర్ చేసి ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శానిటరీ కార్మికులు గురువారం విశాఖ విమ్స్ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. ఈ నెల 30న జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ వాల్పోస్టర్లను ప్రదర్శించారు.