కాలం ఎంతో విలువైనదని దానిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు ఐఐటి ఖరగ్ పూర్ ప్రొఫెసర్ రాజ్ కుమార్ అనంత కృష్ణన్ సూచించారు. బుధవారం ఏయూ సైన్స్ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి బుధవారం ఆయన ప్రసంగించారు. జీవితంలో అపజయాలు ఉంటేనే విజయాన్ని ఆస్వాదించడం సాధ్యపడుతుందన్నారు. సానుకూల ఆలోచనలతో ముందడుగు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎన్. వి. ఆర్ రాజు పాల్గొన్నారు.