7న ఉచిత నేత్ర వైద్య శిబిరం

64చూసినవారు
7న ఉచిత నేత్ర వైద్య శిబిరం
మహిళా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్షులు ఎస్ లలితారెడ్డి శుక్రవారం తెలిపారు. మాధవధార కోదండ రామాలయం ప్రాంగణంలో శ్రీ మాధవ యువజన సమాజం సహకారంతో జరిగే ఈ శిబిరానికి శంకర్ ఫౌండేషన్ వైద్య సిబ్బంది హాజరై పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు అందజేస్తారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ శిబిరాన్ని జంట కాలనీ వాసులు వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్