విశాఖ నగర పోలీసు శాఖలో విధులు నిర్వర్తించి, ఉద్యోగ విరమణ చేసిన ఎనిమిది మంది పోలీసులను సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం సత్కరించి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. పదవీ విరమణ చేసిన వారిలో ప్రభాకర్ (ఏడీసీపీ), నూకన్న, డి. వి అప్పారావు, అప్పా రావు, బి. వి సత్యనారాయణ, అశోక్ కుమార్, ఎం. వి. ఎస్. ఎన్ రాజు, టి. బాబు రావు ఉన్నారు. ప్రభాకర్ స్వయాన మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు కావడం గమనార్హం.