ప్రతికూల వాతావరణం, ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సోమవారం విశాఖపట్నం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సంబంధిత జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.